భారతీయ నివేదిత ( భారతీయుల సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహావ్యక్తి జీవితగాథ )
సోదరి నివేదిత ఒక మానవతావాది. దేశభక్తిలోనూ, విద్యలోనూ, రాజకీయాలలోనూ, పరిశ్రమ, చరిత్ర, నైతిక సంస్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీవాదం… ఇలా అన్ని రంగాలలోనూ చక్కని రాణింపు కలిగి ఉంది. భారతదేశంలో కర్మాచరణకు సిద్ధమై వచ్చిన విదేశీయుల మనస్సులలో శ్రద్ధాభక్తుల కన్నా జాలి, సానుభూతి చూపించే లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నివేదిత మాత్రం భారతదేశాన్ని మాతృదేశంవలె ప్రేమించారు. భారతీయులను తన సొంతవారిగా భావించి సేవించారు.
ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించని ఆదర్శ కర్మయోగిని సోదరి నివేదిత. ఆదర్శం పట్ల ఆమెకు గల అంకితభావం. ఆత్మ సమర్పణాభావం భారతదేశ యువతీయువకులలో స్ఫూర్తిని నింపుతాయి. దేశభక్తిని పాదుగొల్పుతాయి.
Bharatiya Nivedita
Weight 90 g Book Author Ramakrishna Math, Hyderabad
Pages 112
Binding Paper Back
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-85243-59-2
Availability Available