జ్ఞానయుక్త వైరాగ్యముచే కర్మవైముఖ్యం పొందిన శ్రీరామునికి ‘జ్ఞానకర్మలు వేరుకాదని , అవి ఒకే పక్షి యొక్క రెండు రెక్కల వంటివ‘ని ప్రబోధించి తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి వసిష్ఠ మహర్షి చేసిన ప్రయత్నమే 32 వేల శ్లోకాలతో యోగవాసిష్ఠ గ్రంథంగా పరిణమించింది . ఇది మన ఆధ్యాత్మిక ఘన వారసత్వాన్ని తేటతెల్లం చేస్తుంది .
వసిష్ఠ మహర్షి వివరించిన కథలు, దృష్టాంతాలు , యథార్థ సంఘటనలు , పురాణేతిహాసాల ప్రస్తావనలు , ప్రత్యక్ష దర్శనాలు, గతస్మృతుల నెమరువేత – వెరసి ఇదంతా శ్రీరామునికి కర్తవ్యం ప్రబోధించడానికే ; శ్రీరాముని ద్వారా మహాజ్ఞానమైన అద్వైత వేదాంతాన్ని సామాన్య సాధకుడు కూడా అవలీలగా అర్థం చేసుకునే రీతిలో విషయాన్ని విశదీకరిస్తుంది ఈ గ్రంథరాజం .
అందుకే ఆసక్తిదాయకమైన ; సందేశం –కథాగమనం కలసి సాగేలా ఉన్న కొన్ని కథలను మాత్రమే ఎన్నుకొని ఈ పుస్తకం తీర్చిదిద్దాం .
Yogavasista Kathalu యోగవాసిష్ఠ కథలు
Weight 340 g Dimensions 21.5 × 14.2 × 1.4 cm Book Author Swami Jnanadananda
Pages 328
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN 9789388549417