top of page

కఠోపనిషత్తు

కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ ఆరణ్యకం అనే విభాగంలో కఠోపనిషత్తు చోటుచేసుకుంది. వాజశ్రవస ముని కుమారుడైన నచికేతుడు యమధర్మరాజుకి మధ్య జరిగిన సంభాషణమే ఈ ఉపనిషత్తుగా రూపొందించబడింది. ఈ ఉపనిషత్తులో సర్వోత్కృష్ఠ సత్యాలు పొందుపరచబడ్డాయి. భౌతిక స్థాయిలో సుఖంగా జీవించడం ప్రేయోమార్గమనీ, జీవిత సాఫల్యానికై కృషిచేయడం శ్రేయోమార్గమనీ ఈ ఉపనిషత్తు పేర్కొంది. భోగలాలసత్వానికి పెద్దపీట వేసే ప్రస్తుత సమాజానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఈ మార్గాలను ఉపనిషత్తు వివరించింది. ప్రతీ మానవునికి ఒక లక్ష్యం ఉండాలనీ, ఆ లక్ష్యసాధనకై అలుపెరుగని ప్రయత్నంతో ముందుకు సాగాలనీ ఈ ఉపనిషత్తు ప్రబోధిస్తుంది. అయితే అది అంత సులభమైనది కాదు, కత్తిమీదసాము వంటిది. ధీరుడైనవాడు ఇంద్రియాలను నియంత్రించి అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శిస్తాడు. అవిద్య నుండి మేల్కొనండి, లేచి ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యసాధన చేసేంతవరకూ ఆగవద్దు, ముందుకు పదండి అని ఈ ఉపనిషతు ఎలుగెత్తి చాటుతుంది.

కఠోపనిషత్తు – కె. వి. రమణ || Kathopanishattu

SKU: 9448
₹120.00Price
  • Weight 380 g
bottom of page